Gunna Mamidi Komma Meeda - Song Lyrics - Baala Mithrula Katha (1972)

గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది ....

ఆ .... చిలకేమో  పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది

పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దుముద్దుగ ముచ్చటలాడందే
చిగురులు  ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయల ....

గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది ....
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

ఆ .... ఒక  పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయ్
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయ్

రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి

గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది ....
గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి

----------------- Enjoy One Life ----------------- 

Comments

Popular posts from this blog

ಮಧುರ ಮಿಲನ

ಹನಿಗಳಲ್ಲಿ ಕರಗಿದ ಬೆಳಕು

जय जय राधे राधे | Radha Devi Bhakti